గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. ఈమేరకు చంద్రబాబుకి ఆమె లేఖ రాసి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. దాంతో టీడీపీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఇప్పటికే ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ పార్టీ ని వీడుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరం గా ఉంటున్నారు. చంద్రబాబు ను సైతం పెద్దగా పట్టించుకోవట్లేదు.. రాజ్యసభ లో చంద్రబాబు ఒకటి చెప్తే తాను మరొకటి చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో అయన తల్లి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవోడం కొంత అనుమానాలకు దారితీస్తుంది..