టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన నారి నారి నడుమ మురారి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని గత కొన్ని రోజులుగా ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. దానితో శర్వానంద్ మెయిన్ టార్గెట్ ఈ సారి సంక్రాంతి కి రవితేజ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ... ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మూవీ లో కూడా రవితేజ కు జోడిగా ఇద్దరు బ్యూటీలు కనిపించబోతున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమాలో కనిపించబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక నారి నారి నడుమ మురారి సినిమాలో శర్వానంద్ కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి , శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమాలు రెండు కూడా సంక్రాంతి కి విడుదల కానుండడంతో ఈ రెండు సినిమాల్లో హీరోలు ఇద్దరు హీరోయిన్లతో నలిగిపోయే పాత్రలో కనిపించనుండడంతో ఈ సారి శర్వానంద్ మెయిన్ టార్గెట్ రవితేజ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: