ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే..ఏకంగా 151 సీట్లను ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. 50 శాతానికి పైగా ఓట్లు ఇచ్చారు. దీంతో జగన్ మహా బలుడు అని అన్నారంతా. రాజకీయ బాహుబలి అని అభిమానులు పొంగిపోయారు. కానీ ఇపుడు ఏడాదిన్నర పాలన చూశాక జగన్ అనుకున్నట్లుగానే అన్నీ చేయగలుగుతున్నారా అంటే అబ్బే లేదే అన్న జవాబే వస్తుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది.