సాధారణంగా పాన్ కార్డు పొందాలంటే ధరఖాస్తు చేసుకున్న తరువాత రెండు నుండి మూడు వారాల సమయం ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సులభంగా పాన్ కార్డును పొందే అవకాశం కల్పించింది. ఆన్ లైన్లో ధరఖాస్తు చేసిన కొన్ని నిమిషాల్లోనే పాన్ కార్డును పొందే విధంగా నిబంధనలలో మార్పులు చేసింది. పాన్ కార్డు కావాలనుకునేవారు కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు సులభంగా పాన్ కార్డు పొందవచ్చు. 
 
మరికొన్ని రోజుల్లో ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాన్ కార్డ్ పొందాలనుకునే వారు ఆధార్ డేటా ఎంటర్ చేసిన వెంటనే వారికి ఎలక్ట్రానిక్ పాన్ (ఈ పాన్) రెడీ అయిపోతుంది. ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పాన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డులో చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. 
 
ఈ వివరాలు ఉంటే చాలు పాన్ కార్డు సులభంగా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన పాన్ కార్డుపై డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. డిజిటల్ సంతకం చేసిన తరువాత పాన్ కార్డును ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పాన్ కార్డులో ఫోటో పక్కన డెమోగ్రాఫిక్ డేటా ఉంటుంది. డెమోగ్రాఫిక్ డేటా స్కాన్ చేసి ఎక్కడైనా ఎలక్ట్రానిక్ పాన్ కార్డును వాడుకోవచ్చు. 
 
ఫోటోషాపింగ్ ద్వారా పాన్ కార్డులో ఎటువంటి మార్పులు చేయకుండా అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. పాన్ కార్డును సులభంగా పొందటానికి నిబంధనలలో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులలో ఎక్కువ నగదుతో లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు తప్పనిసరి. మారిన నిబంధనలతో పాన్ కార్డు లేని వారు సులభంగా పాన్ కార్డును పొందవచ్చు.  మరికొన్ని రోజుల్లో ప్రజలకు ఎలక్ట్రానిక్ పాన్  సేవలు అందుబాటులోకి రానున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: