రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆధారాలతో సహా ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ప్రెజెంటేషన్ ద్వారా మంగళవారం అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టారు. చంద్రబాబు ఏ విధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటే.. బుగ్గన మాటల్లోనే.. రాష్ట్ర విభజన జరిగినతర్వాత 10 ఏళ్ళు చాలా కీలకం. అటువంటిది విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు.. వరల్డ్ క్లాస్ రాజధాని కడతానని ప్రగల్భాలు పలికి జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31, 2014 మధ్య 4070 ఎకరాలు తన కుటుంబం, తన బినామీలు, టీడీపీ నేతల చేత ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయించాడు. 

ఉల్లంఘించటమే..

ఇది కచ్చితంగా చంద్రబాబు రాజ ధర్మాన్ని ఉల్లంఘించటమే. రాజధాని ప్రాంతంలో ఇంత భారీగా భూములు కొన్నవారిలో స్థానికులు ఎవరూ లేరు. మొదట గుంటూరు.. ఆ తర్వాత నూజివీడు.. అని ప్రజలను తప్పు దారి పట్టించి.. చివరికి అమరావతిని చంద్రబాబు ప్రకటించారు. దళితులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కున్నారు. వాస్తవానికి అయితే ఆ విధంగా దళితుల భూములు లాక్కున్న వారిపై ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలి. లేని లంక భూములను ఉన్నట్టు సృష్టించి దోచేశారు. ప్రభుత్వ భూములను తమ భూములుగా చూపించి టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొట్టేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజధాని ప్రాంతం(సీఆర్డీఏ) సరిహద్దులను తమ ఇష్టారాజ్యంగా, తమకు నచ్చినప్పుడు మార్చుకున్నారు. 

రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన పెద్దలు.. గద్దలు


హెరిటేజ్ : 14.22 ఎకరాలు, మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలు : 55.27 ఎకరాలు, లింగమనేని రమేష్ : 351.25 ఎకరాలు, వేమూరి రవి కుమార్ : 62.77 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుః 38.84 ఎకరాలు, బాలకృష్ణ వియ్యంకుడు : 499 ఎకరాలు, రావెల కిషోర్ బాబు : 40.85 ఎకరాలు, జీవీ ఆంజనేయులు : 37.84 ఎకరాలు, పయ్యావుల కేశవ్ : 15.30 ఎకరాలు, పల్లె రఘునాథ రెడ్డి : 7.5 ఎకరాలు, కోడెల శివప్రసాదరావు :  17.3 ఎకరాలు, ధూళిపాళ్ళ నరేంద్ర : 13.50 ఎకరాలు, కొమ్మాలపాటి శ్రీధర్ :  68.60 ఎకరాలు, పుట్టా మహేష్ యాదవ్ : 7 ఎకరాలు, లోకేష్ బినామీలు, టీడీపీ నాయకులు, వారి బినామీలు కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: