తాను కమ్మ వర్గానికి వ్యతిరేకం కాదని..అందరూ తనకు కావాలని చెబుతూనే... విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా అని ప్రశ్నించారు. అక్కడ తమ పార్టీ నుండి గెలిచిన ఎంపీనే కమ్మవారు అని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచిన వారు కూడా కమ్మవారేనని... కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్ర చారం కోసం చంద్రబాబు నీచానికి దిగజారారని చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

 

కృష్ణా జిల్లాతో తమ కుటుంబానికి విడదీయలేని సంబంధం ఉందంటూ..తన మేనత్తను అదే జిల్లాకు కోడలుగా పంపామని వివరించారు. కొడాలి నాని ఎన్టీఆర్ ఫ్యామిలీ వీరాభిమాని.. జ‌గ‌న్ అంటే ప‌డి చ‌స్తాడు.. అంతెందుకు జ‌గ‌న్ త‌న కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం గురించి సీఎం ప్రస్తావించారు. రఘు ఎవరు..వీరంతా కమ్మవారు కాదా అని ప్రశ్నించారు. కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్‌ కమ్మవారికి వ్యతిరేకమని, విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

 

అయితే సీఎం జగన్ చెప్పిన విధంగా చూసుకుంటే కమ్మ సామాజికవర్గ నేతలు ఆయన్ని ఎక్కువగానే అభిమానిస్తారు. వైసీపీలో కొడాలి నానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కొడాలి కూడా జగన్ అంటే ఎనలేని అభిమానం చూపిస్తారు. ఆయన మీద టీడీపీ ఏమన్నా విమర్శలు చేసిన చూస్తూ ఉండరు. వెంటనే స్పందించి టీడీపీని ఏకీపారేస్తారు. ఇక నానినే కాదు వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ అంటే ప్రాణమిచ్చేలా ఉంటారు. అందులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ కూడా ముందుంటారు.

 

ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా జగన్‌ని అమితంగా ఇష్టపడుతుంటారు. అలాగే జగన్ కూడా కమ్మ సామాజికవర్గ నేతలకు మిక్కిలి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇవేమీ టీడీపీ వాళ్ళ కంటికి కనపడవు, గుడ్డిగా జగన్‌పై కుల ముద్రవేయాలని, కమ్మ కులం ఉందనే అమరావతిని తరలించుకుని వెళ్లిపోతున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: