ఏపీలో  కియా కార్ల కంపెనీ సంస్థ... తమ బ్రాంచ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా గత కొంతకాలంగా ఏపీలోని కియా కార్ల కంపెనీ తరలిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు టిడిపి నేతలు కూడా అధికార పార్టీ తీరు వల్లే కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోవాల్సిన  ఏర్పడిన అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కియా కంపెనీ తరళిపోతుందని వస్తున్న వార్తలు కాస్త లోక్సభ వరకు చేరాయి. కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుండి తరలిపోతున్నట్లు  గత కొంత కాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.కియా  సంస్థ తరలిపోయేందుకు ఏర్పాటు చేసుకుంటుందని... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటూ  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు వేదికగా కోరారు. 

 

 

 దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. గత ప్రభుత్వ పాలనలో పలు ప్రాజెక్టులను చేపట్టడం కూడా జరిగిందని పార్లమెంటు వేదికగా తెలిపిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు... విశాఖలో మిలీనియం టవర్ నిర్మించి వేలాది మందికి టీడీపీ ప్రభుత్వం  ఉపాధి కల్పించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంటులో టీడీపీ ఎంపీ కియా మోటార్స్ తరలింపు గురించి మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి  కల్పించుకున్నారు. ఈరోజు సందర్భంగా రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. 

 

 

 దీంతో ఇరు పార్టీల మధ్య కొద్దిపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్న విధంగా కియా కంపెనీ ఎక్కడికి తరలిపోవడం లేదని అనంతపురం లోనే కియా కంపెనీ కొనసాగుతుంది అంటూ వైసీపీ  ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కియా కంపెనీ ఎండీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారు అంటూ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కియో కంపెనీ అనంతపురం నుంచి తరళిపోతుందని వస్తున్న వార్తలను కియా కంపెనీ ఎండి కూడా ఖండించారు అంటూ తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. టిడిపి నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు.ఈ క్రమంలోనే టిడిపి పార్టీల ఎంపీలు వైసీపీ ఎంపీల మధ్య కొద్దిపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: