వంటిల్లే సర్వసం కాదు, ఇల్లే ప్రపంచం కాదు. మౌనమే స్త్రీల నైజం కాదు, బానిస కారు స్త్రీలు. ఆ రోజులు మారిపోయాయి. ఆకాశానికి వెళ్ళాలన్నా, ఏ రంగంలో రాణించాలన్న స్త్రీలకి ఇప్పుడు సాధ్యం. ఎప్పుడో ఆ రోజులు తగలబడిపోయాయి. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. స్త్రీ ఒక శక్తి. స్త్రీ అభివృద్దే దేశానికీ అభివృద్ధి. కనుక స్త్రీలు చదువుకోవాలి. కలల్ని, కళల్ని సాధ్యం చేసుకోవాలి ఖచ్చితంగా...

 

IHG

 

మన భారతదేశం నుండి స్పేసులోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళా కల్పనా చావ్లా .ఈమె ఇండియన్-అమెరికన్ వ్యోమగామి. అలానే వ్యోమనౌక యంత్ర నిపుణరాలు. 1962 లో హర్యానా లో ఈమె జన్మించింది. 31 రోజుల 14 గంటల 54 నిముషాలు కల్పనా చావ్లా అంతరిక్షంలో గడిపారు. ఈమె పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసారు.

 

IHG

 

1982 లో అమెరికా వెళ్లి టెక్సాస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్  చదువుకున్నారు. ఇలా ఆమె పలు డిగ్రీలు కూడా  చేసారు. కాంగ్రెషనల్ స్పేస్ మోడల్ అఫ్ ఆనర్, nasa స్పేస్ ఫ్లైట్ మోడల్, nasa విశిష్ట సేవా మోడల్, డిఫెన్సె విశిష్ట సేవా మోడల్ అవార్డుని దక్కించుకుంది కల్పనా చావ్లా. కల్పనా చావ్లా పై కొందరు రచయతలు పుస్తకాలూ రచించారు.

 

IHG

 

 

అమోంగ్ ది స్టార్స్- అఫ్ కల్పనా చావ్లా. ఈ పుస్తకాన్ని గుర్దీప్ పందేర్ రచించారు. అలానే ఇండియాస్ 50 మోస్ట్ ఇల్లసట్రి యస్ ఒమెన్ పుస్తకం రచించింది ఇంద్ర గుప్త. కల్పనా చావ్లా, ఏ లైఫ్ రాసిన వారు అనిల్ పద్మనాభన్. ఇలా ఈమెపై పుస్తకాల్ని రచించి సృష్టించిన చరిత్రని అందుకున్న విజయాల్ని తెలియజేసారు. ఈమె జీవితం చెప్పుకోదగ్గది. నేటి స్త్రీలకి నిత్యం ఆదర్శం.17 మార్చ్ 2003  లో ఈమె మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: