రాజకీయ రంగంలో మహిళలకు ముందు నుంచి అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. అయితే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నాటి సమైక్యాంధ్రలో తొలిసారిగా మహిళలకు మంచి అవకాశాలు వచ్చాయి. ఎంతోమంది వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు సైతం రాజశేఖర్‌రెడ్డి పాలనాకాలంలో ఎన్నో కీలకమైన పదవులు అధిరోహించారు. ఇక ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రిని మించేలా ఎంతోమంది మహిళా మణులను ఏకంగా చట్టసభలకు పంపించారు. వైయస్ జగన్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకంగా 23 మందికి పైగా మహిళలకు తమ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అదే టైం లో వైసీపీ నుంచి నలుగురు మహిళలు సైతం లోక్‌స‌భకు ఎంపికయ్యారు. తెలుగు రాజకీయ చరిత్రలో మరే నేత కూడా ఇంత మంది మహిళలకు సీట్లు ఇవ్వాలి లేదంటే అతియోశక్తి కాదు.



ఇక అన‌కాప‌ల్లి నుంచి స‌త్య‌వ‌తి, అమ‌లాపురం నుంచి చింతా అనూరాధ‌, అర‌కు నుంచి గొడ్డేటి మాధ‌వి, కాకినాడ నుంచి వంగా గీత ఎంపీలు అయ్యారు. ఇక ఎంతో మంది మ‌హిళ‌లు తొలిసారి ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా ఎమ్మెల్యేలు అయ్యారు. విడ‌ద‌ల ర‌జ‌నీ, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, రెడ్డి శాంతి, జొన్న‌లగ‌డ్డ ప‌ద్మావ‌తి, ఉషాశ్రీ చ‌ర‌ణ్ ఇలా చెప్పుకుంటే పోతే పుష్ప‌శ్రీవాణి, సుచ‌రిత‌, తానేటి వనిత లాంటి వాళ్ల‌ను జ‌గ‌న్ మంత్రుల‌ను చేశారు. తొమ్మిదినెలల పాలనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల‌న‌లో ‘అమ్మ ఒడి’ వెలుగులు నింపింది.  ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది.



రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. నామినేటెడ్‌ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఇక తెలంగాణ‌లో దిశ హ‌త్యాచారం, హ‌త్య త‌ర్వాత ఏపీలోనూ మ‌హిళల భ‌ద్ర‌త విష‌యంలో జ‌గ‌న్ కేర్ తీసుకున్నారు. ‘దిశ’ చట్టం మహిళలకు భద్రతనిచ్చింది. ఒక్క బటన్‌ నొక్కి దుండగుల భరతం పడుతున్నారు. దేశమంతా ఇపుడు మన ‘దిశ’ వైపే చూస్తోంది. ఇక మ‌ద్యం మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గించారు. ఏదేమైనా జ‌గ‌న్ పాల‌న‌లో ఆమె శ‌క్తి ఉధృత‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: