మారుతి రావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే.నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆర్య వైశ్య భవన్ లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. గతంలో మారుతీ రావు కూతురు అమృతం ప్రణయ్  అనే యువకుడిని కులాంతర  వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన మారుతీరావు ఓ  వ్యక్తికి సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మారుతీరావు ఏకంగా ప్రధాన నిందితుడిగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే అసలు మారుతి రావు ది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు మాత్రం దొరకడం లేదు. అయితే మారుతీరావు మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా లభించిన విషయం తెలిసిందే. గిరిజ  నన్ను క్షమించు అమృత అమ్మ దగ్గరికి వెళ్లి పో అంటూ ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది. 

 

 అయితే ఆత్మహత్య చేసుకున్న అమృత తండ్రి మారుతీరావు ఏకంగా 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. అయితే ఆ ఆస్తి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది అనే అంశం చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా  తనకు ఉన్న రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులను మారుతీ రావు తన భార్య గిరిక తమ్ముడు పేరు మీద వీలునామా రాసి ఉన్నట్లు సమాచారం. అయితే మొదట కిరోసిన్ డీలర్గా వ్యాపారం ప్రారంభించిన మారుతీ రావు... అంచెలంచెలుగా ఎదిగారు. కిరోసిన్ బిజినెస్ తర్వాత రైస్ మిల్లులు బిజినెస్ మొదలు పెట్టాడు మారుతీరావు. ఇక ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మారుతీ రావు కు బాగా కలిసి రావడంతో అంచెలంచెలుగా ఎదిగాడు.కోట్లు సంపాదించాడు.

 

 పోలీసులు చార్జిషీట్ ప్రకారం మారుతీరావు ఆస్తుల వివరాలను చూస్తే మారుతీ రావు కు శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో... విల్లాలను  నిర్మించి అమ్మేవాడు. అంతేకాకుండా అమృత ఆస్పత్రి పేరుతో ఏకంగా వంద పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఇక మారుతీ రావు భార్య గిరిజా పేరుతో పది ఎకరాల భూమి... అంతే కాకుండా హైదరాబాద్ లో మారుతీ రావు కు కొత్తపేట లో 400 గజాల స్థలం. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల 5 ప్లాట్లు నల్గొండలోని మిర్యాలగూడలో షాపింగ్ మాల్... ఈదులగూడెం క్రాస్ రోడ్ లో మరో షాపింగ్ మాల్ మారుతీరావుకు  ఉన్నాయి. అంతే కాకుండా మారుతి రావు తల్లి పేరు మీద కూడా రెండు అంతస్తుల భవనం ఉంది. ఇక మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో 22 గుంటల భూమి మారుతీరావు ఉంది. మొత్తంగా మారుతీ రావు కు 200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: