మిర్యాలగూడ వ్యాపారి... అమృత తండ్రి మారుతీరావు ఆస్తి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మారుతీరావుకు ఉన్న స్థిర, చర ఆస్తుల వ్యాల్యూ... మార్కెట్ ప్రకారం రూ.200 కోట్లుగా లెక్కెతేలింది. అయితే ఇది కేవలం అంచనాలు మాత్రమే వాస్తవంగా ఉన్న విలువ దీనికి రెట్టింపుగా ఉండే అవకాశం ఉందన అంటున్నారు స్థానిక వ్యాపారులు.

 


మొదట కిరోసిన్ డీలర్ గా మొదలైన మారుతీరావు ప్రస్థానం...క్రమంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ వరకు సాగింది. ముందుగా కిరోసిన్ డీలర్ గా ఉన్న మారుతీరావు...తర్వాత రైస్‌ మిల్లుల బిజినెస్ చేశాడు. అక్కడ మంచి లాభాలు రావడంతో...వాటిని అమ్మి రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగారు. అప్పటికే మంచి పొజీషన్ లో ఉన్నా ఆయన...తక్కువ ధరకు భూములను కొని కాపడుకున్నాడు. ఇదే సందర్భంలో శరణ్య గ్రీన్‌ హోమ్స్‌ పేరుతో వంద విల్లాలను కట్టి మంచి ధరకు విక్రయించారు. మారుతీరావు పేరిట హైదరాబాద్‌లోని పలు చోట్ల ఐదు వరకు ఫ్లాట్స్.. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెంలో మరో షాపింగ్‌ మాల్ ఉన్నాయి.

 


ఇవి కాకుండా...మారుతీరావు పేరుపై మిర్యాలగూడ బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి.. సర్వే నెం.457 లో 7 కుంటల భూమి.. దామరచర్లలో 20 ఎకరాల పట్టా లాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్‌, బంగారు గడ్డలో ప్లాట్స్.. మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.

 


మారుతీరావుకు భార్య గిరిజ, కూతురు అమృత మాత్రమే ఉన్నారు. అయితే అమృత ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోగా...భార్య, తను మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అమృత పెళ్లి తర్వాత జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన మారుతీరావు...బయట ఎవరీకి కనిపించకుండా ఉండేవాడు. తాజాగా ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడంతో భార్య గిరిజా ఒంటరిదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: