కరోనా వైరస్ ప్రభావం ఉందని చెబుతూ  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేశాక, రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రమేశ్ కుమార్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయన చంద్రబాబు డైరక్షన్‌లో పని చేస్తూ, ఎన్నికలు వాయిదా వేశారని సీఎం జగన్‌తో సహ చాలామంది వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఇక దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయినా సరే సుప్రీంలో కూడా ఎన్నికల కమిషనర్‌కు అనుకూలంగానే తీర్పు వచ్చింది.

 

దీని తర్వాత భద్రత కావాలని రమేశ్ కుమరే కేంద్రానికి లేఖ రాయడం, అది ఫేక్ అని వైసీపీ ఆరోపించడం, కాదు నిజమని టీడీపీ చెప్పడం, మధ్యలో సెంట్రల్ లేఖ వచ్చిందని, రమేశ్ కుమార్‌కు భద్రత కల్పిస్తున్నామని కేంద్రం హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగిపోయాయి. అయితే రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్న, సీఎం జగన్ సన్నిహితుడు, మంత్రి కొడాలి నాని మాత్రం దీనిపై ఏ మాత్రం స్పందించలేదు. అసలు ఆయన ఈ వ్యవహారాలనే పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.

 

అయితే ఈ ఎన్నికల కమిషనర్ వివాదంలోకి కొడాలి నాని వెళ్లకపోవడానికి కారణం లేకపోలేదు. ఆయన తన నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకోవడానికి కష్టపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోటగా ఉన్న గుడ్లవల్లేరులో జెడ్‌పి‌టి‌సిగా వైసీపీ తరుపున నిలబడిన ఉప్పాల హరికని గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈమె కృష్ణా జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధి. ఒకవేళ ఈమె ఓడిపోతే కొడాలి పరువుపోతుంది.

 

అందుకనే ఎలాగైనా హారికని గెలిపించుకోవడానికి కొడాలి కష్టపడుతున్నారు. దీనికి తోడు కొడాలి కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత అని తెలుసు. అలాంటప్పుడు తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నట్లు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ని కమ్మ సామాజికవర్గ వ్యక్తి అని విమర్శించలేరు. ఈ కారణాలతోనే కొడాలి సైలెంట్ అయిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: