భారతదేశ ప్రజలందరినీ వణికిస్తూ  రోజురోజుకు... శరవేగంగా కోరలు  చాస్తూ ఎంతోమందిని ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతున్నది కరోనా  వైరస్. భారతదేశంలో కరోనా వైరస్  రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక భారతదేశం నుంచి కరోనా వైరస్ ను  తరిమికొట్టాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జనతా కర్ఫ్యూ  విధించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ ఈరోజు ఉదయం 7 గంటల  నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటి నుంచి కాలు బయట పెట్టవద్దని ఏదైనా అత్యవసరం అయినప్పుడు నుండి బయటకు రావాలని... అందరినీ ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ పై పోరాటానికి అందరూ సహకరించాలి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. 

 


 ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ మరోసారి భారత ఐక్యతను చేశారు. చిన్న పెద్ద తేడాలేకుండా... పేద ధనిక అనే తారతమ్యం... సామాన్యులు సెలబ్రిటీలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ  పాటించారు . ఉదయం ఏడు గంటల నుంచి జనతా కర్ఫ్యూ  లో పాల్గొంటూ కరోనా  వైరస్పై యుద్ధం చేశారు. ఓ వైపు కుటుంబంతో హాయిగా గడుపుతూనే మరోవైపు కంటికి కనిపించని శత్రువుకు  కనిపించకుండా ఉండే నిశ్శబ్ద యుద్ధం చేసింది భారత ప్రజానీకం. అంతే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విధంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో భారత ప్రజలందరూ తమ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి కరధ్వనులు  వినిపించారు. అయితే ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ  భారతదేశంలో విజయవంతం అయింది అని చెప్పాలి . 

 

 అయితే తాజాగా కరోనా వైరస్ ను ఉద్దేశించి మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినా జనతా కర్ఫ్యూ  బాగా జరిగింది అంటూ తెలిపారు. అంతేకాకుండా నేషనల్ మీడియాలో ఈరోజు దేశమంతా జనతా కర్ఫ్యూ  బాగా జరిగిందని... పెద్ద నగరాల్లో ముంబై, హైదరాబాద్ బాగా కవరేజ్ చేసాయి  అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. కరోనా  వారిని తరిమి కొట్టడం ప్రజలందరి బాధ్యత అంటూ కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: