కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ మొత్తం ప్రధానమంత్రి మోదీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఏ ఒక్కరు కూడా ఇళ్లనుంచి బయటికి రావొద్దని తెలిపారు. బయటికి రాకపోవటంతో దేశంలో కొన్ని కొన్ని సమస్యలు వెల్లువెత్తాయి. దీంతో అందరి ఆలోచనలు అటువైపే పరుగెత్తుతున్నాయి. కొంతమంది అనారోగ్యంతో ట్రీట్‌ మెంట్ కోసం ఢిల్లీలోని సఫ్దార్ జంగ్, ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులకు దేశం నలుమూలల నుంచి వచ్చిన పేషెంట్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

 

ఢిల్లీకి ఆసుపత్రులకు వచ్చిన వారు ట్రీట్ మెంట్ అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ తో అన్ని మూతపడ్డాయి. ట్రైన్స్, బస్సుల సదుపాయం లేదు. సరేలే అని తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వెళ్లాలంటే అంబులెన్సుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. లేదా అంబులెన్సులో పోదామంటే వేలకు వేలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బులు వారి దగ్గర లేక ఇంటికి పోలేక ఆసుపత్రుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తినటానికి తిండి లేక నీళ్లకు అవస్థలు పడుతున్నారు. దీంతో లాక్ డౌన్ తో వాళ్లకు నరకం కనిపిస్తోందంటున్నారు. ఆస్పత్రుల చుట్టుపక్కల ఉండే స్థలాలలో అందరూ అక్కడే పడుకుంటున్నారు.

 

ఆ పేదలకు అక్కడ ఉంటాటానికి కూడా కనీస సదుపాయాలను ఏ యొక్క స్వచ్చంద సంస్థ కూడా ముందుకు రాకపోవటం గమనార్హం. కనీసం వారి యొక్క పరిస్థితులను చూసి ముందుకు వచ్చిన దాతలను కూడా సదుపాయాలను కల్పించకుండా చేశారు పోలీసులు. ఎవరైనా పెద్ద మనసుతో అన్నం ఇస్తే తింటున్నారు. లేదంటే ఆకలితో పస్తులు ఉంటున్నారు. వారిలో.. బీహార్‌ కి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో ఆసుపత్రి నుంచి బీహార్ వెళ్లేందుకు అంబులెన్స్ ను అడిగారు.

 

డ్రైవర్ 50000 రూపాయలను అ‌గడంతో ఏం చెయ్యాలో తెలియక ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఇలా మరో వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాకి చెందిన తను యూపీకి వెళ్లాలని అంబులెన్స్ ను అడగటంతో రూ.15000 అడిగారు. దీంతో ఏం చేయలేని పరిస్థితి. ఇలానే మరో వ్యక్తి మొరాదాబాద్ వెళ్లేందుకు అంబులెన్సు డ్రైవర్ రూ.20000 అడిగారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. తినటానికి తిండి లేక పస్థులతో వారి ఆకలిని చంపుకుంటూ బతుకుతున్నారు. ఒక ఫామిలీ గత వారం రోజుల నుంచి రొట్టె ముక్కలను తిని బతుకుతుంది. ఇంకా ఒక కుటుంబం మూడు రోజుల నుంచి కేవలం బిస్కెట్లు తింటూ బతుకుతోంది. ఇలా కటిక పేదలు ఆసుపత్రుల డాగర పడిగాపులు కాస్తున్నారు. ఈ లాక్ డౌన్ ప్రకటించటం పేదలకు, రోజు వారి కూలీలకు ఒక శాపంగా మారిందని చెప్పవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: