క‌రోనా మ‌హ‌మ్మారి ఒక్క‌సారిగా రెండు తెలుగు రాష్ట్రాల‌పై పంజా విసిరింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనాకు బ్రేకులు వేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా క‌రోనాను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. ఇక నిన్న దేశంలో కొత్త కేసుల సంఖ్య 147 కేసులు న‌మోదు కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే మ‌న దేశంలో క‌రోనా కేసులు 1400 కు చేరుకుంది. ఇక మంగ‌ళ‌వారం తెలంగాణ‌లో ఒక్క‌సారిగా 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా బాధితుల సంఖ్య ఏకంగా 97కు చేరుకుంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఈ మ‌హమ్మారి భారీన ప‌డి 6 గురు చ‌నిపోయారు.

 

ఇక ఏపీలోనూ క‌రోనా విజృంభిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ కేసుల సంఖ్య బుధ‌వార‌మే 14కు చేరుకుంది. గ‌త రాత్రి వ‌ర‌కు 44 పాజిటివ్ కేసులు బుధ‌వారం ఉద‌యంతో ఒక్క‌సారిగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేసుల‌తో క‌లుపుకుంటే ఏకంగా 58కు చేరుకుంది. అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఏపీలోనూ బుధ‌వారం న‌మోదు అయిన కేసులు అన్నీ కూడా ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారే ద్వారానే వైర‌స్ వ్యాప్తి చెంద‌డం విశేషం. 

 

ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్‌లో వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేస్తున్నా కూడా ఈ రేంజ్‌లో వైర‌స్ వ్యాప్తి చెందుతుందంటే ఇక లాక్ డౌన్ లేక‌పోతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌ట‌కి అయినా ప్ర‌జ‌లు అంద‌రూ లాక్ డౌన్ పాటిస్తూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే మ‌న‌తో పాటు మ‌నం ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారం అవుతాము.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: