భారతదేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. భారత్లో అన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్నది  ఈ మహమ్మారి వైరస్. ఓవైపు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ మహమ్మారి... భారత ప్రజలందరిని  ప్రాణభయం ఉన్న భయానక జీవితాన్ని గడిపేలా చేస్తుంది. మరోవైపు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను... మరింతగా కుదిపేస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఇక అన్ని రంగాలపై ఈ మహమ్మారి వైరస్ ప్రభావం పడి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇలా కరోనా  వైరస్ కేవలం మనుషులపైన కాదు... భారత్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతూనే ఉంది. 

 

 అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని కఠిన  నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతునే  ఉన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఇప్పటికే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ఉండడంతో రోజురోజుకు ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. 

 

 

 అయితే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లో 150కిపైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 229 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. మరో విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులో 50 శాతం కేసులు రాజధాని హైదరాబాద్లోనే నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 20 జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాగా హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలో అధికంగా ఈ మహమ్మారి వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటి తర్వాత వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: