ప్రస్తుతం ప్రజలు, నాయకులు అంతా కరోనా కంగారులో ఉన్నారు. గ్రామ స్థాయి నాయకుడి నుంచి పార్టీ అధినేత వరకు అంతా కరోనా మీదే ఫోకస్ చేశారు. ఎలాగు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడడంతో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు టీడీపీ కీలక నాయకులూ, మాజీ, తాజా ఎమ్యెల్యేలు కొందరు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలోకి వచ్చి చేరారు. ఇంకా అనేక మంది వచ్చి చేరేందుకు ప్రయత్నాల్లో ఉండగానే ఆ సమయంలో అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికలను గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 


 అయితే దీనిపై వైసీపీ పెద్ద రాద్ధాంతం చేసింది. ఇంతలో కరోనా ప్రభావం కూడా ఏపీని చుట్టుముట్టడంతో వైసీపీలో చేరికలకు జగన్ తాత్కాలికంగా బ్రేక్ వేయడంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. అయితే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత నాయకులు పెద్ద ఎత్తున వచ్చి చేరేందుకు చాలామందే సిద్ధమవుతున్నారట. తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమని, చంద్రబాబు వయసు పైబడటం, ఆయన తర్వాత పార్టీని నడిపించే నాయకుడు ఒక్కడు కూడా లేకపోవడం, అలాగే చంద్రబాబు రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగుతున్న లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో వైసిపిలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం బెటర్ అని చాలామంది చూస్తున్నారు. 

 


అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీకి బయట నుంచి మద్దతు పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది కాబట్టి  చాలా మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ మద్దతుదారులుగా ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో చాలామంది టిడిపికి గుడ్ బాయ్ చెప్పి వైసీపీ లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండటంతో, మరికొంతకాలం వీరందరికీ వెయిటింగ్ తప్పేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: