ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీనిని అదుపు చేయడం ప్రభుత్వం వల్ల కావడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది. అయినా ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ, ఈ వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రత రూపం దాల్చుతోంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. లక్షలాది మంది దీని బారిన పడ్డారు. ఇక భారతదేశం విషయానికి వస్తే  మొదట్లో ఈ కేసులో ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే ఢిల్లీలో నిజాముద్దీన్ తబ్లీగి  జమాత్ ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీ లో జరిగిన ఈ ప్రార్థనలకు వేల సంఖ్యలో ఆ మతానికి చెందిన వారు వేలాదిమంది హాజరయ్యారు. అలాగే విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

 

IHG
వారంతా సామూహిక ప్రార్థనలో పాల్గొనడంతో, అక్కడికి వెళ్ళిన వారికి చాలామందికి కరోనా వైరస్ సోకింది. మన దేశంలో నలుమూలల నుంచే కాకుండా 16 రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం, వారిని ఆలస్యంగా గుర్తించడంతో అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. అసలు ఈ వ్యవహారం అంతా జరగడానికి కారణమైన తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఆయనపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకుని అతడితో పాటు, మరో ఐదుగురిపైనా కేసు నమోదు చేశారు.


 ఆయన నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లుగా ఈడీ గుర్తించడంతో దీనిపై దర్యాప్తు మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇదే విషయంలో ఆయనకు సమన్లు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: