తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో  ఎంతోమంది మానవత్వం ఉన్న మంచి మనుషులు ఉన్నారు అన్నది లాక్ డౌన్  సమయంలో నిరూపితమవుతుంది. చాలా మంది నిరుపేదలకు ఆహారం సహాయం చేయడం, కూరలు సహాయం చేయడం లేదా నిత్యవసర వస్తువులు సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ధనవంతులు కాని వారు కూడా ఒక్క రోజైనా ఇలా దానం చేయడానికి ముందుకు వస్తున్నారు . ఇలా నిరుపేదలకు చేయూతనిస్తూ ఇబ్బందులు పడకుండా పలు దానాలు చేస్తున్నా వారు  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నారు అని చెప్పాలి. 

 

 నిరుపేదలకు ఈ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే స్వచ్ఛంద సంస్థలు.. లేదా  నిరుపేదలకు దానం చేయాలి అనుకునే మంచి గుణం ఉన్నవారు.. లాక్ డౌన్  సమయంలో నిరుపేదలకు సహాయం చేస్తూ ఉన్నారు. కానీ మరో బెనిఫిట్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులందరూ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 


 దీంతో నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నారు అభ్యర్థులు. ఇలా ఎన్నికల కోసం సహాయం చేసే వాళ్ళు కొంతమందైతే తమ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు సహాయం చేస్తున్న వాళ్లు కొంతమంది. అయితే తమ నేత జగన్ పిలుపునిచ్చారు అని వైసీపీ నేతలు.. తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అని జనసేన నేతలు.. తమ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు అని టీడీపీ నేతలు ఇలా అందరూ నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలు   ఎలాంటి ఇబ్బంది పడకుండా కాస్త బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: