ముస్లింల పండుగలలో రంజాన్ పండుగ అతి ముఖ్యమైనది. ముస్లింలు చాంద్రమాన్ కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్'. ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించడంతో ఈ మాసంను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం'. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. 
 
రంజాన్ పండుగ సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ద్వారా రంజాన్ పండుగ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. కుటుంబమంతా కలిసి చేసుకునే పండుగ రంజాన్ అని తెలిపారు. 


 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానవత్వానికి అద్దంపట్టే ధర్మ సూత్రాలు ఎన్నో ఇస్లాంలో ఉన్నాయని ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ గా జరుపుకునే ఈ రోజు పేదలెవరూ ఆకలిబాధలతో ఉండకుండా సాటి సమాజం జకాత్ దానాలను చేయాలని ఇస్లాం చెబుతోందని ట్వీట్ చేశారు. 

 

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా "నెలరోజుల రంజాన్ ఉపవాసదీక్షను ముగించుకుని నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్ ను జరుపుకుంటున్న ముస్లింలందరికీ... ఆ అల్లా రక్షణ, కరుణ ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ముస్లిం కుటుంబానికీ ఆనంద, ఐశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈద్ ముబారక్" అని ట్వీట్ చేశారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: