పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సొంత వార్తాపత్రిక, వార్తా ఛానల్ ఉండాలని అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా చాలా రోజుల నుండి అభిప్రాయపడుతున్నారు. అన్ని పార్టీలకు అనుకూల వార్తాపత్రికలు వార్తా చానళ్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ కు కూడా ఉండాలని భావించడంలో తప్పులేదు కానీ పవన్ కళ్యాణ్ దినపత్రికను, న్యూస్ ఛానల్ ను ప్రారంభించడానికి ఎప్పుడు సిద్ధపడతారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 


అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలో ప్రవేశం చేసినప్పుడు అతని గురించి ఎన్నో తప్పుడు వార్తలు ప్రచురించబడ్డాయి. అతని తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గురించి కూడా తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలకు, అభిమానులకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియడం లేదు. అందుకే వారి కోసమే ప్రత్యేకంగా దినపత్రిక, వార్తా ఛానల్ ను స్థాపించి నిజాలను ప్రజలకు తెలియపరచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. 


వార్తపత్రిక, న్యూస్ ఛానల్ రెండూ ఉంటే జనసేన పార్టీని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లొచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు పత్రికలపై, న్యూస్ చానళ్ళ పై తనకు నమ్మకం లేదని తన అభిప్రాయం వెల్లడించాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో తమకంటూ ఒక సొంత పత్రిక స్థాపించే యోచనలో ఉన్నామని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 


పవన్ కళ్యాణ్ కూడా వార్తా పత్రిక,న్యూస్ ఛానల్ స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని... త్వరలోనే తన ప్రయత్నాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఒక ఛానల్ జనసేన పార్టీ ని బాగా సపోర్ట్ చేస్తుంది కానీ దానికి అంతగా ప్రజాదరణ లేదు. ఆ చానల్ ని గాడిలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనా జనసేన పార్టీ అతి త్వరలోనే ఛానల్, పత్రిక లను ప్రారంభించబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: