తెలుగుదేశం పార్టీ అసలే ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. దీనికి తోడు పార్టీ ఉనికిని కాపాడేందుకు నిరంతరం అధికార పార్టీపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ, పార్టీ కేడర్ లో  ఉత్సాహం తీసుకొచ్చే విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయని వెనక్కు తగ్గి, సైలెంట్ గా ఊరుకుంటే, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా దిగజారిపోతుందని, పార్టీ నాయకులు ఎక్కడివారక్కడ చెల్లా చెదురు అవుతారని, అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ నాయకులు గురవుతారని, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి చంద్రబాబు పార్టీ కోసం ఏడు పదుల వయసులోనూ తీవ్రంగా కష్టపడుతున్నారు. కానీ బాబు కష్టం వృధా అవుతున్నట్టు పార్టీ నాయకుల వ్యవహార శైలి ఉంటోంది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AMARAVATI' target='_blank' title='amaravati-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>amaravati</a> tour turns tense as angry farmers ...

ప్రతి నియోజకవర్గంలోనూ, నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏ ఒక్కరు ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఒక వైపు అధికార పార్టీ నుంచి వేధింపులు ఉంటాయనే భయం, మరొకవైపు ఆర్థికంగా పార్టీని ఆదుకోవాల్సి రావడం, ఆందోళన కార్యక్రమాలు వంటివి చేపడితే జేబులకు చిల్లులు పడటం, ఆ తర్వాత తమను పట్టించుకునే వారు ఎవరూ ఉండరు అని, పైగా అధికార పార్టీ నుంచి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించుకుని వారు యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడడం లేదు. అలాగే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వారు చాలామంది ఓటమి చెందారు. వారు ఇప్పుడు అసలు పార్టీలో ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

 


ఎక్కడా వారి ఉనికి కనిపించడం లేదు. గత టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారి పరిస్థితి ఇదే విధంగా ఉంది.పైగా సొంత పార్టీ నాయకులతోనే వివాదాలు పెట్టుకుంటూ, తరచూ వార్తల్లో ఉంటూ, పార్టీ పరువును బజారున పడేసిన ఈ పరిణామాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత ఆగ్రహాన్ని అసహనాన్ని కలిగిస్తాయి. తాను పార్టీ కోసం ఈ వయసులో ఉన్నా, పార్టీ నాయకులు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఎవరూ తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తూ, పార్టీ బరువు బాధ్యతలను మోసేందుకు ఇష్టపడకపోవడం, ఇవన్నీ చంద్రబాబులో మరింత అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: