యుగాంతం యుగాంతం అంటే ఏదో అనుకున్నాం కానీ, ఇప్పుడు నిజంగానే ఆ యుగాంతం వచ్చేసింది అనుకుంటూ గ్రామాల్లో జనాలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందని ముందుగా ఎవరూ ఊహించలేకపోయారు. మొదట్లో ఈ మహమ్మారి చైనాలో బయటపడినా, మిగతా దేశాలన్నీ అది కేవలం చైనా కు మాత్రమే పరిమితం అని అంచనా వేశారు. కానీ అది నిజం కాదనే విషయం తీరని నష్టన్ని చవి చూశాక కానీ ఎవరికీ అర్దం కాలేదు. ఆ కరోనా మహమ్మారి చేసిన నష్టం ఏంటి అనేది. ఇప్పుడు ఈ వైరస్ ను ఎంతగా కట్టడి చేద్దామన్నా, అది కుదరని పని అన్నట్టుగా తయారైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 

 ఇక మన దేశంలోనూ అంతేస్థాయిలో ఉధృతంగా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. మొదట్లో నమోదైన కరోనా కేసులకు ఇప్పుడు నమోదవుతున్న కేసులకు పొంతనే లేదన్నట్లుగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అసలు ఇది వర్షాకాలం కావడంతో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ చల్లటి ప్రదేశాలలో ఎక్కువగా విజృంభిస్తుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఇక రాబోయేది అసలే శీతాకాలం కాబట్టి, ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండడంతో, ఇప్పటి నుంచే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


 కరోనా చల్లటి ప్రదేశంలో ఎక్కువ కాలం జీవించి ఉండగలదని, బయట ఎండలో కంటే, ఇంట్లో ఎక్కువ సమయం గడిపితే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 10 మిలియన్ల మందికి ఈ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం అంచనా అని తేలిగ్గా తీసుకోవద్దని, ఎంతో మందికి సోకే అవకాశం ఉన్నట్టుగా సౌతంప్టన్ NHS ట్రస్ట్ శ్వాసకోస నిపుణుడు హోల్గెట్ సూచించారు.  రాబోయే సీతాకాలంలో కోవిడ్ 19  మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.


ఈ వైరస్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు అని చెబుతున్నారు. ప్రపంచానికి ఈ వైరస్ పీడ ఇప్పట్లో పోయేలా లేదని, ప్రస్తుతం ఎవరి దగ్గర దీనిని పూర్తిస్థాయిలో నివారించే వాక్సిన్ అందుబాటులో లేదని చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారిని ఇసోలేషన్ చేయడం, తాత్కాలిక చికిత్స చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: