ఇటీవలే పాకిస్తాన్ తనంతట తాను ఐక్యరాజ్యసమితి అనుబందంగా ఉన్న ఎఫ్ఏటిఎఫ్ ముందు దోషిగా మారిపోయింది . అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని అంటూ ఇటీవల పాకిస్థాన్ ప్రకటించింది. దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన విషయాన్ని పాక్ ప్రకటన చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం మారింది . ఆ తర్వాత కొంత సేపటికి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో లేడు అంటూ యూటర్న్ తీసుకుంది పాకిస్థాన్. పాకిస్తాన్ తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎఫ్ఏటిఎఫ్.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ఐక్యరాజ్యసమితి సిద్ధమైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ ను కాపాడేందుకు మూడు దేశాలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. చైనా టర్కీ మలేషియా దేశాలు పాకిస్తాన్ ను కాపాడేందుకు సిద్ధమయ్యాయట . ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఉన్న ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ పై ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధిస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అన్న ఆరోపణలు వస్తున్న తరుణంలో త్వరలో పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టి ఎందుకు సిద్ధమైంది. అయితే పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టొద్దు అంటూ ఓటు వేసేందుకు సిద్ధం అయ్యాయి చైనా టర్కీ మలేషియా దేశాలు. మరీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి