ఆడవాళ్ళ పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.ప్రభుత్వ చట్టాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను అమలు చేస్తున్న కూడా మాన, ప్రాణాలను కాపాడ లేకపోతున్నారు.అభాగ్యులైన మహిళలు కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు.వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్నైతే, చీకటిలో జరుగుతున్న దాడులు ఎన్నో లెక్క లేనన్ని ఉన్నాయి. డబ్బుండందనీ కొందరు, కులం గొప్ప అని మరికొందరు, అధికారం తో ఉన్న వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆడవాళ్ళను చెప్పు కింద తేలులుగా చూస్తున్నారు..జీవితాలను నాశనం చేస్తున్నారు.


ఉత్తర భారత దేశంలో మహిళల పై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ నుంచే దక్షిణ భారత దేశంలో కూడా లైంగిక దాడులకు కొదవ లేకుండా పోతుంది.అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది. అన్నట్లు కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా కొత్త కేసులు నమోదు అవ్వడం గమనార్హం.అసలు విషయానికొస్తే..బీహార్ ప్రజలను భయానక వాతావరణంలో ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు.నేరాల శాతం బీహార్ లో 40 శాతానికి పైన ఉందని ఆయన అన్నారు.



రాష్ట్రంలో ప్రతి 4 గంటలకు ఒక మహిళ లైంగిక దాడికి గురవ్వడమే కాదు , రోజులో 5 గంటలకు ఒకసారి ఊహకు అందని విధంగా హత్యకు కూడా గురవుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయం పై సీఎం నితీశ్ కుమార్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే బీహార్ లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల్లో గెలుపు కోసం అధికారి జేడీయూ, విపక్ష ఆర్జేడీ పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆర్జేడీకి చెందిన కొందరు నేతలు జే‌డీయూ లో చేరగా మరికొందరు మాత్రం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు.ఇది ఇలా ఉండగా ఎన్డీఏ కూటమి మాత్రం మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు..మరి ఈ పరిస్థితి ఎంత వరకు వెళుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: