ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు క్రైమ్ రేటు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖ పట్టణాలలో నమోదు అవుతున్న కేసులు పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఆడవాళ్ళను దేవతలుగా పూజించాలని పెద్దలు చెబుతుంటారు. వాటిని ఏ మాత్రం పట్టించుకోని కామాంధులు క్రూర మృగాలు లాగా మారి పశువాంచన తీర్చుకుంటున్నారు. ఈ మధ్య విజయవాడ, బెజవాడ, విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది తన ప్రేమను తిరస్కరించిందని అతి దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటిచాడు.. మంటలు చెలరేగడంతో యువతి అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయింది.



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన విజయవాడ , బెజవాడలో చోటు చేసుకుంది. నాగ భూషణం అనే వ్యక్తి చిన్నారి అనే యువతిని  ప్రేమించించమంటూ వెంటపడి వేధింపుల గురి చేశాడు. ప్రతి రోజు ఆమె వెళ్ళే దారిలో కాపు కాచి ఇబ్బందులకు గురిచేసే వాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆదేశించింది. తనని నాగభూషణం అనే వ్యక్తి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని పిలిపించి విచారణ చేపట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అమ్మాయి జోలికి వెళ్లనని నోట్ రాయించారు.  కొద్ది రోజులు తన జోలికి రాకపోవడంతో కేసు ను వాపస్ తీసుకుంది. అదే చిన్నారి చేసిన అతి పెద్ద పొరపాటు.



ఇక ఆసుపత్రిలో విధులను ముగించుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి బయలు దేరింది.నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు.. ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆమె వినక పోవడంతో అతను కోపొద్రుడు అయ్యాడు. తనతో ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ ను పోసి నిప్పు అంటించారు.అతడికి మంటలు వ్యాపించాయి. చిన్నారి అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిపోయిన అతనికి ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.గుంటూరు జీజీహెచ్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: