గత కొంతకాలంగా ఏపీ బీజేపీ నేతలు మంచి దూకుడుగా ఉంటూ వస్తున్నారు. గతంతో పోలిస్తే, కాస్త ఎక్కువ ఉత్సాహం పెరిగినట్టుగా ఆ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, వంటి కారణాలతో ఏపీ బీజేపీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుది. 2024 నాటికి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా పార్టీ నాయకులను సస్పెండ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నారు.


ఈ మధ్యకాలంలో బిజెపిలో చేరికలకంటే ఎక్కువగా సస్పెన్షన్ ల వ్యవాహారాలే చోటుచేసుకుంటున్నాయి. దీంతో బీజేపీ వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అవుతున్న నేతలంతా అమరావతి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, పార్టీ నియమ నిబంధనలు పట్టించుకోకపోవడం, వారు అవసరం ఉన్నా, లేకపోయినా , టీవీ డెబిట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా ని సొంత అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తం చేయడం వంటి వ్యవహారాలు కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్నాయి.


వీటన్నిటి పైన దృష్టి పెట్టిన బిజెపి ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు... అటువంటి నేతలను గుర్తించి ఒక్కొక్కరు పైనా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు తాజాగా లంక  దినకరన్ అనే పార్టీ నాయకుడుని, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే ఆయన సస్పెన్షన్ వేటు వేశారు.అంతకుముందు అమరావతి మద్దతుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటున్నారంటూ సీనియర్ నాయకులు వెలగపూడి గోపాలకృష్ణ, అనే వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీపతి రాజుని కూడా అనుమతి లేకుండా టీవీ టీవీ చర్చ కార్యక్రమాలకు వెళ్తున్నారు అంటూ ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు.


 అలాగే అమరావతి కి మద్దతుగా మాట్లాడిన వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. ఇంత వరకు బాగానే ఉన్నా, 2024లో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపి కేసులపై దృష్టి పెట్టకుండా, ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరిపైనా వేటు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో, అసలు ఏపీ బిజెపి లో ఏం జరుగుతుంది అనేది తెలియక రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: