విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల అమరవీరుల దినోత్సవ పరేడ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్... పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్.. అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సిఎంతో పాటుగా అమరవీరుల  సంస్మరణ దినోత్సవంలో డిజిపి గౌతమ్ సవాంగ్, హోంమంత్రి సుచరిత, మంత్రులు, మరియు పోలీస్ ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

1959 అక్టోబర్ 22న పోరాడిన ఎస్సై కరన్ సింగ్ ధైర్యాన్ని, పదిమంది పోలీసుల త్యాగాన్ని మన దేశం గుర్తు చేసుకుంటోంది అని సిఎం అన్నారు. ప్రతీ పోలీసు అమరవీరుడికి జేజేలు అంటూ ఆయన సెల్యూట్ చేసారు. నాలుగు దిక్కుల నుంచీ ఎటువంటి ఆపద వచ్చినా కాపాడే ధైర్యసాహసాలు ధర్మచక్రం చెపుతుంది అని అన్నారు. అధికారం ఎంత గొప్ప బాధ్యత అనేది అశోక చక్రం క్రింద ఉన్న సత్యమేవ జయతే అన్నది చెపుతుందని అన్నారు. దేశం అభివృద్ధి చెప్పే తలసరి ఆదాయం కన్నా ముఖ్యమైనది నేరాల రేటు తక్కువగా  ఉందని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న మనలాంటి సమాజలాలో నేరాలు అంత త్వరగా తగ్గుతాయని అనుకోవడం లేదని అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రధానమైన విషయంని ఆయన చెప్పారు. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించద్దని అన్నారు. కుల మత ఘర్షణలలో ఎలాంటి ఉపేక్ష లేకుండా పనిచేయాలని పోలీసులకు చెపుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయని అన్నారు. దిశ బిల్లు త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఏపీలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా సుచరితను నియమించామని చెప్పారు. ఇసుక, మద్యం దొంగదారి పడుతుంటే చట్టం తన పని చేస్తున్నది నాకు తెలుసని అన్నారు. అదనపు సిబ్బంది అవసరాన్ని తెలుసుకుని డిసెంబరు లో నోటిఫికేషన్ ఇవ్వాలని, ఏడాదికి 6500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: