ఇటీవలే తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణం గా తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడి పోయింది. వర్షాకాలం పూర్తయి శీతా కాలం ప్రారంభమైనప్పటికీ కూడా ఎక్కడా వర్షాలు తగ్గు ముఖం పట్టకపోవడం తో ప్రజలంద రూ బెంబేలెత్తి పోయారు అనడం లో అతిశయోక్తి లేదు. ఇక భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం లో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోగా... గ్రామాల్లో చేతికొచ్చిన పంట మొత్తం పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.



 వరద పరివాహక ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నం గా మారిపోయింది. ఎప్పుడు ప్రాణం మీదికి వచ్చి వరదలు  ప్రాణాలు తీస్తాయో  అని  భయపడుతూ నే బ్రతుకులు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్నటివరకు తెలంగాణ రాష్ట్రం లో వరుసగా వర్షాలు ఉన్నాయి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంద రూ  బెంబేలెత్తి పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు  తెలంగాణ రాష్ట్రానికి వర్షపూ  ముప్పు తప్పుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఊపిరిపీల్చుకున్నారు.



 తెలంగాణ రాష్ట్రం లో నేడు రేపు పొడి వాతావరణం ఉంటుంది అంటూ తెలిపిన వాతావరణ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనలు లేవు అంటూ స్పష్టం చేశారు.  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి నైరుతీ రుతుపవనాల నిష్క్రమణ మరో 4 రోజుల్లో జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  అయితే కనిష్ట ఉష్ణోగ్రత లో ఎక్కువ మొత్తంలో తగ్గుదల నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ తెలిపిన వాతావరణ శాఖ అధికారులు...  దీంతో రాత్రి సమయంలో చలిగాలులు ఎక్కువ అవుతాయి అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: