వైసీపీ పార్టీ తరపున గెలిచి వైసీపీ నాయకులను విమర్శిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇప్పటికీ రోజుకో విషయంపై వైసీపీ పార్టీ నేతలను విమర్శిస్తూనే ఉన్నారు..  పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఒక్క రఘు రామ కృష్ణం రాజు అని పార్టీ నేతలు చెప్తున్నారు.. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు.. మరో ప్రతిపక్షం లా తయారైన రఘు రామ నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా జగన్ ఇంతవరకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు.. ఇక ఇటీవలే జగన్ మోడీ వద్ద ఈ పంచాయితీ ని ఉంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఆయనను ఓ పదవినుంచి తొలగించారు..  వైసీపీ తరపున గెలిచిన రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏం చూసుకుని రఘు రామ కృష్ణం రాజు ఇంతలా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు.. బీజేపీ పార్టీ కి జగన్ దగ్గరవుతున్నారు ఇంకా రఘు రామ రాజు విమర్శలు ఆపట్లేదు..

ఇక తాజగా అయన అసలు వ్యూహం ఏంటి అనేది తెలుస్తుంది. తాను రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలు ఎలాగుండాలనే విషయంలో మంచి క్లారిటితోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మీడియాతో ఎంపి మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తే అమరావతి అంశమే రెఫరెండంగా ఉపఎన్నికలు జరుగుతాయని బల్లగుద్ది చెబుతున్నారు. అపుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సిఎం వ్యతిరేక ఓట్లన్నీ తనకు పడతాయనే ఆశతో ఉన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అనుకునే పార్టీలన్నీ తనకే మద్దతుగా నిలబడాలని రాజుగారు చాలా ఆశపడుతున్నారు. మరి రఘు రామ రాజు ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: