టైటిల్ చూడగానే.. చేతినిండా డబ్బు ఉండి కూడా ఆకలితో చనిపోవడం ఏంటి అనే అనుమానం మీకు కలిగింది కదా. కానీ ఇక్కడ ఇదే జరిగింది. ఏకంగా ఒక శాస్త్రవేత్త చేతినిండా డబ్బులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటిస్తూ చివరికి ప్రాణాలు వదిలాడు. 20వ శతాబ్దంలో ఒక గొప్ప గణిత శాస్త్రవేత్తగా ఎంతగానో పేరెన్నికగన్న శాస్త్రవేతకు ఈ పరిస్థితి వచ్చింది. ఆయనకు మానసిక ఇబ్బందులు తలెత్తిన  కారణంగానే ఇంత దారుణ స్థితిలో మరణించ వలసి  వచ్చింది. ఆస్ట్రియ  హంగేరి కి చెందిన కుర్డ్ గాడెల్  అనే శాస్త్రవేత్త 1906 ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. ఈయన  ఒక గణిత శాస్త్రవేత్త గొప్ప తత్వవేత్త కూడాఈయనను  గణిత శాస్త్రవేత్తగా ఎంతోమంది అరిస్టాటిల్ తో పోల్చారు.



 అంతేకాదు ఎన్నో ఆవిష్కరణలకు కూడా ఈయన ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పాలి.  గణితంలో మాస్టర్ సంపాదించిన ఆయన అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేశారు. ఇక అమెరికాలో పౌరసత్వం సంపాదించుకున్న కుర్డ్ అక్కడే స్థిరపడి పోయారు. గణిత శాస్త్రవేత్తగా ఆయన ఆలోచనలకు ఆవిష్కరణలకు ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్న. 70 ఏళ్ళ  వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా చురుకుగా ఉన్నారు ఆయన. కానీ చివరి రోజుల్లో ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మరణం అందరిని కలిచి వేసింది



 ఏకంగా చేతినిండా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కడుపు మాడ్చుకుని మరి కన్నుమూశారు సదరు శాస్త్రవేత్త. ఇంతకీ ఆ  శాస్త్రవేత్త అలా కడుపు మార్చుకోడానికి వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఆహారం వడ్డించే వారిపై  నమ్మకం లేక సదరు శాస్త్రవేత అలాగే కడుపు మాడ్చుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఎవరైనా విషం పెట్టి చంపేస్తారేమో అని భయపడటం మొదలయింది. ఎవ్వరు ఆహారం పెట్టిన అనుమాన పడుతూ ఉండేవాడు. దీంతో వీధుల్లో అమ్మే కూరగాయలను తినడం మానేశాడు. కేవలం ఆయన భార్య చేసిన వంట తినేవాడు. ఇక ఒకానొక సమయంలో శాస్త్రవేత్త భార్య అనారోగ్యానికీ గురై   ఆసుపత్రిలో ఆరు నెలల పాటు ఉంది. ఈ క్రమంలోనే ఎవరిపై నమ్మకం లేక భార్య వంట చేసే స్థితిలో లేక చివరికి తినడం మానేసాడు. దీంతో చివరికి ఆకలిచావు కొనితెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: