బీజేపీ ఇప్పటికిప్పుడు బలపడాలని ఏం కోరుకోవట్లేదని ఆపార్టీ అవలంభిస్తున్న విధానాలను చూస్తే అర్థం అవుతుంది.. మొదట్లో ఉండీ ఉండనట్లే బీజేపీ పార్టీ తన రాజకీయ కార్యకలాపాలు ఏపీలో కొనసాగించేది.. దానికి తోడు అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా పెద్ద గా ఎవరికీ తెలియక పోవడంతో , విమర్శలు కూడా ఎక్కువ చేయకపోవడంతో పార్టీ పెద్ద గా లైం లైట్ లోకి రాలేదు.. అప్పుడో ఇప్పుడో జీవీఎల్ నరసింహ రావు లాంటి కొంతమంది నేతలు విమర్శలు చేస్తే ఓహో బీజేపీ పార్టీ ఏపీలో ఉందా అని అనిపించేది..

కానీ ఇప్పుడు పరిష్టితి అలా లేదు.. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాల్లో హల్చల్ చేస్తూ బీజేపీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యారు..వాస్తవానికి ఒక పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ నడిపించే నాయకుడు ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి.. అంతేకాదు  నాయకుడు కి అందరిని కలుపుకుపోయే గుణం కూడా ఉండాలి.. అయితే మొదట్లో దూకుడుగా ఉన్నా ఇటీవలే బీజేపీ నయా అధ్యక్షుడు సోము వీర్రాజు పై పార్టీ లో కొంత వ్యతిరేకత అయితే ఉందని తెలుస్తుంది..

‌న్నా లక్ష్మీనారాయ‌ణ బీజేపీ సార‌థిగా ఉన్న స‌మ‌యంలో చాలా మందిని ప్రోత్స‌హించారు. మీరు కూడా మాట్లాడాలి. నేను ఒక్క‌డినే మాట్లాడితే కుద‌ర‌దు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్నారు. పార్టీలైన్ మీకు తెలుసు. వ‌చ్చి న అవ‌కాశాన్ని వ‌దులు కోకండి. మాట్లాడండి అని ఆయ‌న ప్రోత్స‌హించేవారు. దీంతో చాలా మంది నేత‌లు ముందుకు వ‌చ్చి.. బీజేపీ త‌ర‌పున వాయిస్ వినిపించేవారు. జిల్లాల్లోనూ నేత‌లు మీడియా స‌మావేశాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు సోము ఒక్కడే బీజేపీ లీడర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఏ ఒక్క‌రూ కూడా మీడియా మీటింగులు పెట్ట‌డం లేదు. ఏదైనా మాట్లాడాలంటే.. ఏం మాట్లాడాల‌ని అనుకుంటున్నారో.. ఏం మాట్లాడ‌తారో.. ఎలా మాట్లాడ‌తారో.. ముందుగా స్క్రిప్టు త‌న‌కు పంపించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోము వీర్రాజు బీజేపీ కి పెద్ద మైనస్ అవబోతున్నాడని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: