కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ లోన్ లపై  మారటోరియం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు కొన్ని నెలల పాటు అందరికీ మారటోరియం సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రకాల బ్యాంకులు సంస్థలు కూడా ఈ మారటోరియం ని తమ కస్టమర్లకు అందించాయి.



 కాగా ఇటీవలే మారటోరియం  వడ్డీ పై వడ్డీని మాఫీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని  అందరికీ శుభ వార్త చెప్పింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ చక్ర వడ్డీ మాఫీ విషయంలో క్రెడిట్  కార్డు వినియోగ దారులకు మాత్రం వర్తించదు అంటూ ఆర్బిఐ స్పష్టం చేయడంతో క్రెడిట్ కార్డు దారులు సుప్రీంకోర్టును  ఈ విషయంపై ఆశ్రయించారు. కాగా క్రెడిట్ కార్డు వినియోగదారులందరికీ సుప్రీంకోర్టు లో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు మారటోరియం పై వడ్డీ మాఫీ వర్తించదు అంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇటీవలే క్రెడిట్ కార్డు వినియోగదారులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.



 క్రెడిట్ కార్డ్ వాడే వినియోగదారులు అందరికీ కూడా లోన్ వడ్డీ మాఫీ అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  కరోనా వైరస్ సమయంలో పర్సనల్ లోన్ మొదలుకొని క్రెడిట్ కార్డు లోన్ వరకు సదుపాయం వర్తిస్తుంది అంటూ తేల్చి చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ కూడా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.  క్రెడిట్ కార్డు వినియోగదారులు లోన్ పొందలేదని కేవలం కొనుగోళ్లు మాత్రమే చేశారు అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: