అగ్రరాజ్యపు కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న జోబైడెన్... టీమ్ అమెరికాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదీ అసలు సిసలు టీమ్ అమెరికా అనిపించేలా.. జాగ్రత్తగా సభ్యుల్ని ఎంపిక చేస్తోంది బైడెన్ వర్గం. అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యత ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. వైట్‌హౌజ్‌లో అపాయింట్ అయిన తొలి 100 మంది లిస్టును ప్రకటించారు.
శ్వేతసౌథంలో కీలక పాత్ర పోషించబోయే బైడెన్ టీమ్‌లో... 61 శాతం మహిళలు కాగా.. 54 శాతం అమెరికాలోని అన్ని వర్ణాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. 11 శాతం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటికీ చెందిన వాళ్లు ఉన్నట్టు బైడెన్ ట్రాన్సిషన్ టీమ్ తెలిపింది. ఈ టీమ్ అమెరికా... తొలి రోజు నుంచే తమ పనితీరును చూపిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు భిన్నమైన భావజాలానికి ప్రాధాన్యత ఇచ్చి.. టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్టు బైడెన్ వర్గం చెబుతోంది.
వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్.. మొదటి నుంచీ తమ బృందాన్ని.. టీమ్ అమెరికాలా తీర్చిదిద్దాలని భావించినట్లు జో బైడెన్ తెలిపారు. ఇలా వైవిధ్యమైన టీమ్‌ను ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సమర్థవంతమైన పరిష్కారాలు దొరుకుతాయని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న జో బైడెన్ తన మంత్రి వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తన కేబినెట్ లో చలాకీగా పనిచేసే వ్యక్తులను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 100మంది సభ్యుల పేర్లను ప్రకటించిన ఆయన.. మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి