ఇక పౌల్ట్రీ హబ్‌గా పేరొందిన జింద్ జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు 4 లక్షల కోళ్ల విక్రయం జరుగుతుందని అంచనా. బర్డ్ ఫ్లూ కారణంగా సేల్స్ పడి పోయి ప్రతి రోజు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు. ఢిల్లీ మార్కెట్లో బ్రాయిలర్ కోడి ధర కిలో రూ.15లు పలుకుతుండడంతో చికెన్ దుకాణ దారులు గగ్గోలు పెడుతున్నారు.
అయితే చికెన్‌ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెట్టి వండితే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. WHO, UN వంటి సంస్థలు ఇదే విషయాన్ని చెబుతున్నాయ్. ఎటువంటి రా మీట్ నైనా 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెడితే, బ్యాక్టీరియాలు, వైరస్ లు చనిపోతాయ్. దీంతో వైరస్, బ్యాక్టీరియాల నుంచి హాని ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కోడిగుడ్లను, చికెన్ ను నీటితో శుభ్రం చేస్తే సరిపోతుందని కొందరు భావిస్తారు. అయితే, ఇలాంటి సమయాల్లో వైరస్ లు చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. కచ్చితంగా చికెన్ ను, గుడ్లను సరియైన ఉష్ణోగ్రతల వద్ద ఉడకబెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బయట తినడం కన్నా.. ఇంటిలో వండుకున్న పదార్థాలనే తినడం మంచిది. ఇక కోడిగుడ్డులోని పచ్చ సోనను అలా తాగడం ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. కోడి గుడ్లను కూడా బాగా ఉడకబెట్టి తింటే మంచిదంటున్నారు నిపుణులు. ఇక, చికెన్, కోడిగుడ్లు వండేటప్పుడు చేతుల్ని 20 నుంచి 30 నిమిషాలు ముందు శుభ్రంగా కడుక్కుంటే మంచిది. ఏది ఏమైనా పక్షుల మరణానికి ఇతర కారణాలు ఉన్నా చికెన్ పేరు చెబితే బర్డ్ ప్లూ గుర్తొచ్చి భయపడిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి