
హైదరాబాదులో ఇదే ఎజెండాతో ముందుకు వెళ్లి విజయం సాధించారని అంటున్నారు. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాల మీద ఫోకస్ పెట్టిన బండి సంజయ్... టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి హిందూత్వ ఎజెండాను భారీగా వాడుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా తెలంగాణలో ఆయన ఆలయాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఏ దేవాలయాలను అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదో ఆ దేవాలయాల వద్ద ఆయన పర్యటనలు చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రముఖ దేవాలయాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్మరిస్తున్నారు అనే భావన భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దేవాలయాలను బీజేపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. బండి సంజయ్ త్వరలోనే తెలంగాణలో ఉన్న కొన్ని పురాతన దేవాలయాలకు వెళ్లి ఆ దేవాలయానికి సంబంధించి కొన్ని వాస్తవాలను బయటపెట్టి హిందువుల ఓట్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. మరి ఈ రాజకీయం బిజెపికి ఎంత వరకు కలిసి వస్తుంది... బండి సంజయ్ కి ఎంత ఇమేజ్ వస్తుంది అనేది చూడాలి.