ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఆరోగ్యకరమైన పండ్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎన్నో ఆరోగ్యకరమైన పండ్లలో  డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అన్న విషయం తెలిసిందే.  ఇక మిగతా ఫ్రూట్స్ తో  పోలిస్తే డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పై ఎక్కువగా దృష్టి సారించిన వారు ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉండటంతో ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్లో డిమాండ్ అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.



 ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి కూడా ఎంతో ఆకర్షించే రూపుతో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఆరోగ్యకరమైన ఫ్రూట్ లలో ఒకటిగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ పేరును ఇటీవల ఓ  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది. సాధారణంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా  డ్రాగన్ ఫ్రూట్ అదే పేరుతో పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ గుజరాత్ లో మాత్రం ఇక నుంచి డ్రాగన్ ఫ్రూట్ అని కాకుండా కమలం ఫ్రూట్ అని  పిలవాల్సి వస్తుంది. ఇటీవలే డ్రాగన్ ఫ్రూట్ పేరు మారుస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.



 డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మారుస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది గుజరాత్లో ఉన్న బిజెపి ప్రభుత్వం. డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి కమలం పువ్వు మాదిరిగానే ఉంటుందని..అందుకే ఈ పేరు మార్చినట్లు ప్రస్తుతం అధికార పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ లోని ప్రజలందరూ కూడా ఇకనుంచి డ్రాగన్ ఫ్రూట్ ను కమలం అని పిలవాలి అంటూ స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని  ప్రజలందరికీ సూచించడం గమనార్హం. అయితే డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చడం పై అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: