ప్రస్తుతం దేశం లోని అన్ని రాష్ట్రాల లో కూడా బిజెపి విజయం సాధిస్తూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఎన్నికలలో కూడా విజయ డంక  మోగిస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ సత్తా చాటిన పార్టీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇప్పటికీ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేరళ లాంటి  రాష్ట్రం లో ఇప్పటివరకు బీజేపీ పాగా వేయలేక పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.   ఎంతలా బిజెపి గెలవాలని ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా గెలిచిన దాఖలాలు లేవు.



 ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో కేరళలో విజయం సాధించాలి అనుకున్న బిజెపి...  సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేరళలోని క్రిస్టియన్, ముస్లిం  ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల  వైపు ఉండగా ఇక ఇప్పుడు విద్యావంతులను తెర మీదకు తెచ్చేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి  సామాజిక వర్గాలు కాంగ్రెస్ కమ్యూనిస్టుల వైపు పూర్తిగా ముగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది విద్యావంతుల తో రంగంలోకి దిగుతుంది బిజెపి.



 ఇటీవలే మెట్రో చీప్ శ్రీధరన్ లాంటి వాళ్లు వచ్చి బిజెపిలో చేరడం ఆసక్తికరంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు..  లేటెస్ట్ గా కేరళ హైకోర్టు మాజీ జడ్జి  సురేంద్ర కేరళ, మాజీ డిజిపి వేణుగోపాలన్  కూడా బిజెపిలో జాయిన్ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టారు. ఇలా విద్యావంతుల ప్రాంతమైన కేరళలో విద్యావంతులనే  రంగంలోకి దింపి ఇక ఓట్లు సంపాదించాలి అని బీజేపీ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: