ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణం.. ఎంతో పెద్దగా పెరిగిపోయిన చెట్లు కనిపించేవి. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆధునిక టెక్నాలజీ అంటూ అన్ని చెట్లను కొట్టి వేస్తూ ఇక అక్కడ ఇల్లు నిర్మిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం తెలిసిందే.  చెట్ల పెంపకం విషయంలో  అందరూ కూడా అశ్రద్ధ గానే ఉంటున్నారు. వెరసి రోజురోజుకు చెట్లు కనుమరుగైపోతున్నాయి.  ఒకప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎంతో చరిత్ర కలిగిన ఎన్నో ఏళ్ల నుంచి పెరుగుతున్నట్లు కనిపించేవి..  ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి చెట్టు  ఏదైనా కనిపించింది అంటే చాలు ఇక అక్కడ కాసేపు గడిపి  ఆ చెట్టుతో ఫోటో తీసుకోవడం లాంటివి చేస్తున్నారు.



 దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత సమాజంలో చెట్ల విషయంలో ప్రజలు ఎంత అశ్రద్ధ వహిస్తున్నారని.. ఈ క్రమంలోనే పర్యావరణ రక్షణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే విరివిగా చెట్లు నాటాలి అంటూ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాయి ప్రభుత్వాలు. అంతే కాకుండా లక్షల చెట్లను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హర్యానా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.



 సాధారణంగా అయితే మనుషులు వృద్ధులు అయిపోయిన తర్వాత వారికి ఆసరాగా ఉండేందుకు ఆసరా పింఛన్లు అందిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు.. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా చెట్లకు కూడా పింఛన్ అందించేందుకు సిద్ధమైంది హర్యానా ప్రభుత్వం.  70 ఏళ్లు దాటిన చెట్లకు వృద్ధాప్య పింఛన్ అందించేందుకు సిద్ధమైంది. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లకు పింఛన్ అందిస్తే వాటి నిర్వహణ సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెట్ల  వివరాలను సేకరించాలి అంటూ  అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం అన్ని గ్రామాలు కలియతిరిగి ఆయా గ్రామాల్లో లబ్ధి పొందాల్సిన  చెట్ల వివరాలను తెలుసుకుంటున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: