ప్రకాశం జిల్లాలో కొంత మంది వైసీపీ నేతల మధ్య విభేదాలు పైకి కనపడకుండా లోపల ఎక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కొంతమంది నేతలు ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు గత కొంతకాలంగా వినపడుతూనే ఉన్నాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అందరితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాస్తా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. దీనిని ఆధిపత్యం గా భావించిన కొంత మంది వైసీపీ నేతలు ఆయన విషయంలో అసహనంగా ఉన్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే ప్రచారం వైసీపీ  వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో అలాగే ప్రభుత్వంలో ఆయనకు ముందు నుంచి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైసీపీ నేతల విషయంలో కాస్త సీరియస్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఆయన ప్రకాశం జిల్లాలో సమర్ధవంతంగా పని చేయని నేతల మీద ఒక రిపోర్టు కూడా సిద్ధం చేశారని సమాచారం.

శ్రీనివాసరెడ్డి మంత్రిగా కూడా సమర్థవంతంగా పని చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తనకు సహకరించని ఎమ్మెల్యే విషయంలో కూడా ఆయన సీఎం జగన్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే అధికారుల పనితీరు విషయంలో కూడా ఇప్పుడు సీఎం జగన్ కు ఫిర్యాదు చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రకాశం జిల్లా లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్ కొంతమంది ఎమ్మెల్యేలు కు సంబంధించిన నివేదికలను ఆయన వద్ద నుంచి తెప్పించుకున్నారని... త్వరలోనే ఎమ్మెల్యేలు ఉన్న సరే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి నివేదిక ఆధారంగా నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: