రాజకీయ నాయకులు గుడ్డిగా వ్యవహరిస్తే చిక్కుల్లో చిక్కుకోక తప్పదు.. ఇందుకు తెలుగు దేశం నేత దేవినేని ఉమ వ్యవహారం ఉదాహరణగా నిలుస్తోంది. గుడ్డిగా టీడీపీ సోషల్ మీడియా తయారు చేసిన వీడియోను తిరుపతి ఎన్నికల ప్రచారంలో వాడిన ఆయన ఇప్పుడు సీఐడి కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది. మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమాపై సిఐడి కేసు నమోదు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అనని మాటలను అన్నట్లుగా మార్పింగ్ చేసి ప్రచారం చేశారన్నది దేవినేనిపై అభియోగం.

దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్‌కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడారు. దీంతో పాటు ఓ నకిలీ వీడియోను ప్రదర్శించారట. దాన్ని తన సామాజిక మాధ్యమాల్లోనూ పెట్టారట. దీనిపై కర్నూలు జిల్లా లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌. నారాయణరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. సీఎం అనని మాటలను అన్నట్లు మార్ఫింగ్‌ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు.

ఈ కేసుపై దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టు.. వివేకానంద ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టు.. బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టు అని జగన్‌కు దేవినేని ఉమ సవాల్ చేశారు.ఈ సవాళ్ల సంగతి తర్వాత కానీ.. అసలు సోషల్ మీడియాతో తిరిగే వీడియోలన్నీ నిజమేనని భ్రమించి వాడుకుంటే తిప్పలు తప్పవని ఈ కేసులో అర్థవుతోంది.  

ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమపై పెట్టిన కేసు సెక్షన్ 505 కేసు.. అంటే రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసినట్లుగా ఆరోపిస్తూ ఈ కేసు పెట్టారు. తిరుపతిలో చదువుకున్న వారు ఉండటానికి ఇష్టపడరని ఓ సారి జగన్ వ్యాఖ్యానించినట్టు ఆ వీడియోలో ఉంది. పాపం.. చిల్లర పని చేసిన ఉమకు చిక్కులు తప్పవా అనుకుంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: