కరోనా వైరస్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొంతమంది ఆఫీస్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నారు.ఇప్పటికి  లాక్ డౌన్ కారణంగా పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా జాబ్స్ చేస్తున్నారు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులపై  ఒత్తిడి అనేది అధికమవుతోంది. ఫలితంగా చాలా మంది తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. అవి ఏంటనే విషయానికి వస్తే అతి సుదీర్ఘ సమయం పాటు ఉద్యోగం చేస్తున్నవారు వేల సంఖ్యలో మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

2106లో నిర్వహించిన అధ్యయన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ బయట పెట్టింది. ఇలా ఇంటిపట్టున ఉంటూ ఉద్యగం చేసే వాళ్ళల్లో ప్రతి ఏడాది 745000 మంది మరణిస్తున్నట్లు ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. అంతేకాకుండా ఎక్కువ సేపు పనిచేయడం వల్ల 2016లో ఏడు లక్షల 45 వేల మంది మరణించారని, వారిలో ఎక్కువగా గుండె సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినవారు అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. వీరు ఎక్కువగా దక్షిణాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతానికి చెందినవారుగా ఉన్నారు.ఇప్పుడు అసలే కరోనా కష్ట కాలం. అందరూ ఇంటి దగ్గర ఉండే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మరణాల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది.వారానికి 55 గంటలు లేదా అంత కన్నా ఎక్కువ సమయం పనిచేస్తే దాని వల్ల 35 శాతం మంది ఉద్యోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన రిపోర్ట్‌లో చెప్పింది.అలాగే వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసేవారితో పోలుస్తూ.. డబ్లూహెచ్‌వో ఈ నివేదికను తయారు చేసింది.



ఈ అధ్యయనం కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) కూడా పనిచేసింది.అయితే వీరిలో ఎక్కువగా మధ్య వయస్కులు లేదా అంత కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన అధ్యయనంలో తేల్చింది.అయితే కరోనా కాలంలో మాత్రం ఈ స్టడీ చేయలేదు. అయితే లాక్‌డౌన్ వల్ల కంపెనీలు వర్కింగ్ హవర్స్ దాదాపు 10 శాతం పెంచినట్లు డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ ఆఫీసర్ ఫ్రాంక్ పెగా తెలిపారు. దీని వల్ల ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని, దాంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని కూడా డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో ఓ సూచన చేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: