ఒకవేళ ప్రభుత్వాలు వైరస్ నియంత్రణలో సరైన చర్యలు తీసుకోకపోతే వెంటనే స్పందిస్తున్న హైకోర్టులు ఏకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలు సైతం జారీ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఎన్నోసార్లు కీలక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు.. ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా కేసుల పై ఏపీ హైకోర్టులో విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు అంటూ ఏపీ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాగా దీనిపై విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే అటు చిన్నారులపై ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎలా ఉంది.. బ్లాక్ కాంగ్రెస్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది హైకోర్టు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 1777 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి అంటూ రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ కొరత ఉందని.. కేంద్రం ప్రభుత్వం సహకరించడం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలపగా.. ఇంజక్షన్ కొరత పై కేంద్రం సరైన అఫిడవిట్ దాఖలు చేయలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఏపీలో ఇంజెక్షన్ల కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికను నిర్ణీత సమయంలో హైకోర్టులో సమర్పించాలి అంటూ ఈ సందర్భంగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి