ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆనందయ్య కరోనా మందు హాట్ టాపిక్ గా మారి పోయింది. వైరస్ బారిన పడి ఎంత అనారోగ్యం భారిన పడినప్పటికి ఆనందయ్య కరోనా మందు కేవలం నిమిషాల వ్యవధి లోనే సాధారణ స్థితికి తీసుకు వస్తూ ఉండటం తో ఇక్కడ తెలుగు ప్రజలు మొత్తం ఆనందయ్య మందు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారూ. ఇక ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి, కేంద్ర ఆయుష్ మిషిన్ నుంచి కూడా ఆనందయ్య మందు వాడటానికి అనుమతి రావడం తో ప్రస్తుతం ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే నెల్లూరు లోని కృష్ణపట్నం లో ఇక ఆనందయ్య మందు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు జనాలు. కాగా హైకోర్టు అనుమతి తర్వాత నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుంది.  ఈ క్రమంలోనే ఆనందయ్య మందు తీసుకునేందుకు అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కృష్ణపట్నం తరలివెళుతున్నారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం ఆనందయ్య  మందు కోసం ప్రస్తుతం తరలి వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యం లో తెలుగు చిత్ర పరిశ్రమ లో విలక్షణ నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న జగపతిబాబు ఆనందయ్య మందు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ఆనందయ్య ముందు తాను ఎప్పుడో తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు జగపతిబాబు. ఇప్పటివరకు ఆనందయ్య మందు వాడిన వారిలో తాను కూడా ఒకడిని అంటూ చెప్పుకొచ్చారు. ఆయుర్వేదం ఎప్పుడూ తప్పు చేయదు అన్న నమ్మకం తనకు ఉందని అంతేకాకుండా భూదేవి ప్రకృతి కూడా తప్పు చేయను అని తాను నమ్ముతాను అంటూ జగపతి బాబు తెలిపారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అని తెలుసుకున్న తర్వాత మొదటి డోస్ తీసుకున్నానని ఇప్పటి వరకు తనకు కరోనా లేదు అంటూ జగపతి బాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: