అధునాతన నాగరికత వైపు అడుగులు వేస్తున్న మనిషి అటు కనీస మానవత్వం మరచిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.  ప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న తరుణంలో..  మనుషుల్లో మానవత్వం అనేది ఒకటి ఉంటుంది అన్న దాన్ని ఆదమరిచి దారుణం గా వ్యవహరిస్తున్నాడు.  కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్తైనా కనికరం లేకుండా ఎంతో కఠినంగా వ్యవహరిస్తూన్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.



 రోజు రోజుకి ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో జన్మనిచ్చి ఎంతో కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యం లో కాస్తయినా విలువ ఇవ్వడం లేదు పిల్లలు.  తమ పిల్లలు తమకు బారం కాదు అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని పిల్లలను ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు ఇక ఇప్పుడు ఆ పిల్లలకు భారం అయిపోయారు.  ఇక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఏకంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఆనందంగా ఉన్న తల్లిదండ్రులను ఆకలితో అలమటించేలా చేసాడు ఇక్కడ కొడుకు   చివరికి తనకు ఆకలి బాధ తెలియకుండా చేసిన తల్లిదండ్రులను ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చాడు.  అన్నం పెట్టకుండా అమ్మానాన్నలను చంపుకున్నాడు ఇక్కడ ఒక కొడుకు. సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెం కు చెందిన రామచంద్రారెడ్డి అనసూయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఇక ఇటీవలే ఇద్దరు కొడుకులకు కూడా చెరో 20 ఎకరాల భూమిని ఇచ్చారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ఇటీవల చిన్న కొడుకు మరణించడంతో ఇక తల్లిదండ్రులను పెద్దకొడుకు ఇంటికి తీసుకెళ్లి తన వద్ద ఉంచుకున్నాడు. అయితే వారిని భారంగా భావించిన కొడుకు వారికి అన్నం పెట్టడమే మానేసాడు. దీంతో ఇక ఆ వృద్ధులు చనిపోయారు. కరోనా మరణం అని నమ్మించి రహస్యంగా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో వృద్ధులవి ఆకలి చావులు అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: