ఇలాంటి నేపథ్యంలో అటు తాలిబన్ల రాజ్యం మరోసారి రాకుండా ఉండేందుకు ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాలిబన్లను ఎక్కడికక్కడ మట్టు పెడుతోంది. ఇటీవలే తాలిబన్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ విరుచుకు పడింది. గత కొన్ని రోజుల నుండి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మొత్తం తాలిబన్లను వెంటాడి వేటాడుతుంది. భారత్లోని డెహ్రాడూన్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. ఇక నిఘా వ్యవహారాలతో పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది భారత్. ఇలా భారత్ లో ప్రత్యేక శిక్షణ పొందిన బృందం ఇక ఇప్పుడు తాలిబన్లపై విరుచుకు పడుతోంది.
ఇటీవలే తాలిబన్ కమాండర్ మౌలిక్ షఫీ తో సహా ఏకంగా 13 మంది ఉగ్రవాదులను ఏరి పారేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక సైన్యం. అంతేకాకుండా మిగితా ఉగ్రవాదుల కోసం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రోత్సాహక ఉగ్ర మూకలు ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్న నేపథ్యంలో మరోసారి మునుపటి దారుణ పరిస్థితులు రాకుండా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు అందరూ సైన్యానికి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మొత్తం ఉగ్రవాద మూకలపై దాడులకు పాల్పడుతూ ఎక్కడికక్కడ కాల్చి చంపేస్తోంది. ఈ క్రమంలోనే తాలిబన్లు ప్రస్తుతం ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి