ఏపీలో మ‌రో మూడేళ్ల వ‌ర‌కు  ఏ చిన్న ప‌ద‌వి వ‌చ్చినా కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ పార్టీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌డం.. ఇటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ నూటికి నూరు శాతం విజయాలు సాధించ‌డంతో ఒక్క ఎమ్మెల్సీ కాని.. ఒక్క రాజ్య‌స‌భ సీటు కాని టీడీపీకి ద‌క్క‌దు. ఇక ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా ఆ రెండు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఈ రెండిటిని కూడా జ‌గ‌న్ బీసీ వ‌ర్గాల‌కే కేటాయించారు. జ‌గ‌న్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌రమ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు జ‌గ‌న్ రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఇచ్చారు.

అంత‌కు ముందు వైసీపీ నుంచి రెడ్డి నేత‌లే ఎక్కువుగా రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డంతో జ‌గ‌న్ ఆ విమ‌ర్శ‌ను పోగొట్టేందుకు మొన్న ట‌ర్మ్ లో రెండు రాజ్య‌సభ ప‌ద‌వులు బీసీల‌కే ఇచ్చారు. చంద్ర‌బాబుతో పోలిస్తే ఈ విష‌యంలో జ‌గ‌న్ చాలా డేరింగ్ నిర్ణ‌యం తీసుకుని ప్ర‌శంస‌లు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ టార్గెట్ కాపులే అని తెలుస్తోంది. కాపు కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా కాపు కోటాలో జ‌గ‌న్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లును రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని పార్టీలోనే మ‌రో వ‌ర్గంలో వినిపిస్తోన్న టాక్ ?

ఇటీవ‌లే ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వి కాలం ముగిసింది. మ‌రోసారి ఆయ‌న‌కు ఆ ప‌ద‌వే క‌ట్ట‌బెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ ప‌ద‌విని కాపుల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఉమ్మారెడ్డికే ఇచ్చే ఆలోచ‌న పార్టీ కీల‌క నేత‌లు, జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఉమ్మారెడ్డి సీనియ‌ర్ నేతే.. ఆయ‌న‌కు మంచి వాయిస్ ఉంది. అయితే ఈ వ‌య‌స్సులో ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇస్తే ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది జ‌గ‌న్ ఆలోచించుకోవాల‌ని కూడా పార్టీలోనే కొంద‌రు రుస‌రుస‌లాడుతున్నారు. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యం ఏంటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: