అయితే వీటన్నింటికీ కారణం అయిన జగన్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని భావించిన రఘురామ, జగన్ కు అక్రమాస్తుల కేసుల విషయములో ఇచ్చిన బెయిలును రద్దు చేయమని పిటిషన్ వేయడం జరిగింది. ఇది అలా అలా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇది నిన్న కోర్టులో విచారణకు వచ్చింది. రఘురామరాజు ఎలాగైనా జగన్ ను మళ్లీ జైలుకు పంపాలని కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ విషయంలో సీబీఐ సమాధానం కీలకం అని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టు సీబీఐని అడుగగా, సీబీఐ తుది నిర్ణయాన్ని కోర్టు కే ఇచ్చివేసింది. అయినా పదే పదే రఘురామ రాజు తరపు లాయర్ సీబీఐ ఈ విషయంలో వారి నిర్ణయాన్ని చెప్పాల్సిందే అని పట్టు బట్టుకుని కూర్చున్నారు. ఈ విషయాన్ని కోర్టు పలు మార్లు అడిగినా, సీబీఐ మాత్రం ఈ విషయంలో ఒకే స్టాండ్ తీసుకుని కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సబబేనని చెప్పకనే చెప్పింది.
దీనితో కోపోద్రిక్తులైన రఘురామ లాయర్ మాత్రం సీబీఐ పై ఒత్తిడి తెస్తూ ఉండడం గమనించాల్సిన విషయం. జగన్ బెయిల్ ను రద్దు చేయాల్సిన అవసరం రఘురామరాజుకు ఉండొచ్చేమో కానీ, సీబీఐ కి ఉండదు కదా. అయినా జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ రద్దును కోరడమైనది. అయితే ఈ కేసులన్నీ కూడా రాజకీయంగా పెట్టినవే అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రఘురామ రాజు తరపు లాయర్ సిబిఐ పై ఈ విధమైన ఒత్తిడి తీసుకురావడం కారణంగా జగన్ బెయిలు రద్దు విషయంలో కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ముందు ముందు ఏ విధమైన పరిణామాలు జరగనున్నాయి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి