మన దేశంలో చట్టాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. కానీ సరైన... సమయానికి కోర్టుల్లో న్యాయం జరకపోవడంతో... ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసు వేసిన...కొన్ని ఏళ్ల తర్వాత తీర్పులు వస్తున్నాయి. అయితే... ఆ తీర్పులు వచ్చే సరికి... కేసు వేసిన వారే మృతి చెందటం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ఇలాంటి ఘటనే తాజాగా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అయితే.. సంఘటన గురించి వివరాలలోకి వెళితే.... మహరాష్ట్ర లోని ఓ గ్రామంలో సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ అనే వృద్ధుడు ఉన్నాడు. సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ వయస్సు 108 సంవత్సరాలు.  


అయితే... సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌... 1968 సంవత్సరంలో తన గ్రామానికి సమీపంలో ఉన్న ఓ ల్యాండ్‌ ను కొనుక్కున్నాడు. అన్ని ప్రభుత్వ నియమ నిబంధనాల ప్రకారమే ఈ భూమిని కొన్నాడు సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌. అయితే... ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే... సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ కొనుకున్న భూమి అంతకు ముందే... బ్యాంకు లో తనఖాలో ఉంది. అవును సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ కొన్న భూమికి సంబంధించిన యజమాని... తన అవసరాల కోసం... ఆ భూమి కాగితాలు బ్యాంకులో పెట్టి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం తెలియక సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌... ఆ భూమిని కొనేశాడు. దీంతో వివాదం చెలరేగింది. ఎలాగైనా... ఈ వివాదాన్ని ముగించుకోవాలని సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ భూమి వివాదంలో గైక్వాడ్‌ న్యాయస్థానం చుట్టూ తిరగాడు సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌.

  అయితే... ఈ కేసు ముంబై ఉన్నత న్యాయస్థానంలోనే దాదాపు 27 ఏళ్లు పెండింగ్‌ లోనే ఉంది. ఇక ఈ కేసు విచారణను దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తరలించాలని ముంబై  హైకోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ సుప్రీం కోర్టు తిరుగుతూనే ఉన్నాడు. అయితే.. ఈ కేసు విచారణకు వచ్చేలోగా ఆయనకు 108 ఏళ్లు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఈ భూమి వివాదం కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. కానీ సుప్రీం కోర్టు అంగీకారం తెలిపే లోపే.... ఆ వృద్ధుడు మృతి చెందాడు. సుప్రీం కోర్టు ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ వృద్ధుడి నిరీక్షణకు ఫలితం లేకుండా పోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: