సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే నడిచి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజల్లో సైతం దీనిపై విమర్శలు రావడంతో వైసిపి మొద్దు నిద్ర లేచిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విజయసాయి రెడ్డి రాజ్యసభ లో చాలా ఓవర్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన రాజ్యసభలో వేగంగా డిప్యూటీ చైర్మన్ మీదే కాగితాలు విసిరి నవ్వుల పాలయ్యారు. ఈ అతి వల్ల తెలుగు రాజకీయాల్లో కూడా వైసిపి హైలెట్ కాలేకపోతోంది అన్నది నిజం. మరోవైపు జగన్ మీద ఉండాల్సిన కేసులు... జగన్ బాధలు జగన్ కు ఉన్నాయి. అందుకే జగన్ ధైర్యం చేసి కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పోరాటం చేసే పరిస్థితి లేదు.

మరోవైపు జగన్ బలహీనతలను ఆసరాగా చేసుకొని కేంద్రం కూడా ఆడుకుంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు స్పష్టం చేసింది. గతంలో ఎన్డీయే లో కీలక భాగస్వామి గా ఉన్న టిడిపి సైతం ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసిపి సరైన పోరాటం చేయడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీ - టిడిపి రాజకీయంగా బద్ద శత్రువులు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా, పోలవరం పనులు చేసినా.. పోరాటం చేసిన వైసిపి తీవ్రంగా విమర్శించింది.

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా , పోలవరం గాలికొదిలేసిన పరిస్థితి ఉంది. పైగా ఏపీకి సరైన రాజధాని అంటూ లేకుండా పోయింది. ఏపీలో టిడిపి - వైసిపికి రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అన్న విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి తో ఆటలు ఆడుకుంటోంది. అంతిమంగా టిడిపి మీద వైసిపి... వైసిపి మీద టిడిపి చాడీలు చెప్పుకుంటూ ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆసరాగా చేసుకొని కేంద్రం చోద్యం చూస్తూ కాలం గడిపేస్తోంది. కేంద్రం కూడా భారతదేశ పటంలో ఏపీ అన్న రాష్ట్రం ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే జ‌గ‌న్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా మోడీ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: